సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు
సిపిఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న
ఉద్యమ కెరటం , కాగజ్ నగర్ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) అఖిలభారత కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి భారతదేశానికి తీరనిలోటని సిపిఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న అన్నారు. గురువారం కాగజ్ నగర్ పట్టణ కార్యాలయంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే రాజకీయాల వైపు వచ్చారని JNU లాంటి విద్యా సంస్థను వామపక్ష ఉద్యమాల వైపు నిలిపారని కొనియాడారు. బహుభాష కొవిధుడని, ప్రపంచ కమ్యూనిస్టు మేధావుల లో ఒక్కరని అన్నారు. నేపాల్ సంక్షేమ సమయంలో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సలహాలు ఇచ్చిన దాంట్లో పాత్ర పోషించారని, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం ఒక తాటి మీదికి రావడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఉద్యమ నేతకనే కాక మంచి పార్లమెంటరియన్ అని కూడా అన్నారు. అనేక ప్రజా సమస్యల పైన ప్రత్యక్ష ఉద్యమాల నిర్మించిన నేతను దేశం కోల్పోవడం దిగ్బ్రాంతి కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట శ్రీనివాస్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ముంజం శ్రీనివాస్, ముంజo.ఆనంద్ కుమార్, పార్టీ నాయకులు జాడి మల్లయ్య, ఉట్ల రవి, అంగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comment List