ఆస్తిత్వం కోసం మరో పోరాటం : జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క

పోరాట యోధుడికి నివాళి

On
 ఆస్తిత్వం కోసం మరో పోరాటం : జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క

*పొరుగడ్డ పై పోరు బిడ్డకు ఘన నివాళి*

*ఆస్తిత్వం కోసం మరో పోరాటం*

*ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది*

*ఐటీడీఏ ను ప్రక్షాళన చేస్తాం*


*జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క*

*జోడేఘాట్ లో ఘనంగా భీం వర్ధంతి*

*పోరాట యోధుడికి నివాళి*

*సమాధి వద్ద ప్రత్యేక పూజలు*

*ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు*

ఉద్యమ కెరటం, అసిఫాబాద్ ప్రతినిధి : ఆదివాసుల ఆరాధ్య దైవం జల్ జంగల్ జమీన్ కోసం నైజాం సర్కార్ తో పోరాడి అసువులు బాసిన పోరాట యోధుడు కొమరం భీమ్ 84 వర్ధంతి  సందర్బంగా గురువారం పోరు బిడ్డకు పోరుగడ్డపై ఘన నివాళులు అర్పించారు. జోడేఘాట్ లోని కొమురం భీం సమాధి వద్ద సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేపట్టి , జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క , ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన దర్బార్ లో సీతక్క ప్రసంగిస్తూ, ఆదివాసులు, గిరిజనులు తమ ఆస్థిత్వం కోసం మరో పోరాటం చేయవలసిన అవసరం ఏర్పడిందన్నారు. జోడే ఘాట్ ప్రాంతాన్ని ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఒకప్పుడు ఐటీడీఏ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా, నేడు నిర్వీర్యం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయినా, ఆదివాసీల అభివృద్ధి జరగలేదని అన్నారు. ఐ టి డి ఏ ను ప్రక్షాళన చేస్తామని, ఆదివాసి గిరిజనులతో సలహా మండలి ఏర్పాటు చేసి, వారి సూచనలు స లహాలు  పరిగణలోకి  తీసుకొని ఐటిడిఎ ద్వారా గిరిజన ఆదివాసుల అభివృద్ధి చెందాలాగా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. జోడేఘాట్ ప్రాంతంలో 6 కోట్ల రూపాయలతో  అభివృద్ధి చేస్తామని అన్నారు. పోరు గ్రామాలైన జోడే ఘాట్ 12 గ్రామాలలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు  మంజూరు చేస్తామని అన్నారు. రాంజీ గోండ్, బిర్సా ముండా, సమ్మక్క సారక్క, కొమురం భీమ్ లాంటి గిరిజన నాయకులు అస్తిత్వం కోసం హక్కుల కోసం పోరాడినారని, అదే బాటలో వారి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. ఏ విధంగా అయితే  నిధులు నియామకాలు, స్వరం ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ ఉద్యమ ఏ విధంగా సాగిందో, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని తెలిపారు. అటవీ హక్కుల చట్టం కింద 60 వేల పోడు పట్టాలు గిరిజనులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఆదివాసీలు జీవనోపాధి కోసం, పోడు భూములలో సాగు చేసుకుంటుంటే, అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం  ప్రదర్శించి ఆదివాసి గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అటవీ శాఖ అధికారులు తమ పరిధి దాటి, ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోడగాట్ ప్రాంతంలోని 12 గిరిజన గ్రామాలలో వారి హక్కుల కోసం, స్థానికేతరులు ఎవరు  కూడా ఆక్రమించుకోకుండా అటవీ పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ ద్వారా, సర్వేలు చేసి నివేదికలుఇవ్వాలని కోరారు. కొమరం భీమ్ ప్రాజెక్టు అభివృద్ధి చేసి టూరిజంఅభివృద్ధి చేస్తామని అన్నారు. కొమరం భీం ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యం మేరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆదివాసి గిరిజనుల కోసం రెండు కోట్ల 70 లక్షలతో గిరిజన సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. జూడగాట్ 12 గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాల  ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జైనురు లో జరిగిన సంఘటన నేపథ్యంలో , గిరిజన సంఘాల నాయకులను ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. 
అనంతరం కొమురం భీం జీవిత చరిత్రపై చిత్రీకరించిన లఘు చిత్రం సి. డి.నివ్ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. 9 తెగలకు చెందిన వారు తమ సమస్యలను ప్రజా దర్బార్ దృష్టికి తీసుకురాగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కొమురం భీమ్ వర్ధంతి పురస్కరించుకొని తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, గీతాలాపన అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు గోడెం నగేష్, ఎమ్మెల్సీ దండ విట్టల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, ప్రేమ్ సాగర్ రావు, వెడ్మ బొజ్జూ ,పాల్వాయి హరీష్ బాబు, జిల్లా కలెక్టర్  వెంకటేష్ దోత్రే, జిసిసి చైర్మన్ కోట్నాక తిరుపతి,
రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ దీపక్ తివారి,  కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, కొమరం భీమ్ మనవడు సోనేరావు, వర్ధంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పెందూర్ రాజేశ్వర్ , నాయకులు అజ్మీర శ్యాం నాయక్, విశ్వ ప్రసాద్ రావు, అరిగెల నాగేశ్వరరావు, ఆత్రం సుగుణ, గిరిజన సంఘాల నాయకులు పెందూర్ మోతిరాం, మడావి గుణవంతరావు,  కొమురం భీమ్ వర్ధంతి నిర్వహణ కమిటీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

 ఆస్తిత్వం కోసం మరో పోరాటం : జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆస్తిత్వం కోసం మరో పోరాటం : జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క
*పొరుగడ్డ పై పోరు బిడ్డకు ఘన నివాళి* *ఆస్తిత్వం కోసం మరో పోరాటం* *ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది* *ఐటీడీఏ ను ప్రక్షాళన చేస్తాం* *జిల్లా...
అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు
వినాయక నిమజ్జన కార్యక్రమం కొరకు పూర్తిస్థాయి ఏర్పాట్లు
పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్
సీఎంతో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి భేటీ
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి