అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి
ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ రూరల్ : జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలలో గర్భిణులు, బాలింతలు, పిల్లల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. గురువారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం ఎల్లారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, జనకాపూర్ 4వ కేంద్రాలను జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించి ఆయా కేంద్రాలలోని సౌకర్యాలు, రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పిల్లల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. నేను ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, గర్భిణీలు సమీప ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తమ వివరాలు నమోదు చేసుకొని సమయాన్నిసారంగా పరీక్షలు నిర్వహించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో అవసరమైన మరో మత్తు పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బాలికల వసతి గృహాన్ని షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి సజీవన్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించి వంటశాల, గదులు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం సకాలంలో ఆహారం అందించాలని, వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comment List