రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

On
రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 2న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దుతో పాటు విద్యా సంస్థలకు  సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. ప్రస్తుత భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రాకూడదని, ప్రజల రక్షణ కొరకు అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని, ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని, వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణ కొరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నం.6304686505 ఏర్పాటు చేయడం జరిగిందని, అత్యవసర సేవలు నిమిత్తం ప్రజలు సంప్రదించవచ్చని తెలిపారు.

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

 ఆస్తిత్వం కోసం మరో పోరాటం : జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆస్తిత్వం కోసం మరో పోరాటం : జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క
*పొరుగడ్డ పై పోరు బిడ్డకు ఘన నివాళి* *ఆస్తిత్వం కోసం మరో పోరాటం* *ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది* *ఐటీడీఏ ను ప్రక్షాళన చేస్తాం* *జిల్లా...
అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు
వినాయక నిమజ్జన కార్యక్రమం కొరకు పూర్తిస్థాయి ఏర్పాట్లు
పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్
సీఎంతో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి భేటీ
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి